కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 3
2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో జిల్లాలోని మెడికల్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ వర్కెర్స్ యూనియన్ (సీఐటీయూ)సమ్మె నోటీసు ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి DR.K.లలితదేవి కి అందజేయడం జరిగినది.
యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ అరోగ్య రక్షణ లో195 దేశాల్లో 145 స్థానం లో ఉన్నదని,కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 2.16శాతం కేటాయిస్తుందని, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కి 200 కోట్లు కేటాయించి అరోగ్య రక్షణ లో విఫలం అయింది.పలితంగా బాలింత మరణాలు లక్ష మందిలో 30 ,శిశు మరణాలు వెయ్యికి 28 మంది చనిపోతున్నారు. మందుల మీద 18 శాతం GST విధిస్తున్నది. అందుకని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు అఖిలభారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యంగా 2024 ఫిబ్రవరి 16వ తేదీన అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతో పాటు గ్రామీణ బంధు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ సమ్మెలో అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్ ఎన్ హెచ్ ఎం కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని,ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చింది. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందని అందుకని జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్ ఫిబ్రవరి 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో కార్మిక సంఘాలు పిలుపులో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు స్రవంతి,రజిత,వరలక్ష్మి,రమాదేవి,ఉమాదేవి, నిర్మల పాల్గొన్నారు.