కళాకారులకు ఎన్ఆర్ఐ సతీష్ దర్భ చేయూత

 

25 వేల ఆర్థిక సాయం అయిదు వేల నిత్యావసర సరుకులు పంపిణీ

మానవత్వం చాటుకున్న అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ దంపతులు

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 12 (ప్రజాబలం) ఖమ్మం ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులన్న సామెతకు నిలువుటద్దం ఈ చేయూత. కళాకారులుగా సుపరిచితులై సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా మరణించిన ధరావత్ నరేష్ నాయక్ కుటుంబానికి, అదేవిధంగా యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ సర్జరీ అయిన మరో రచయిత, కళాకారుడు రేలా నాగరాజుకు, మున్నేరు వరద ఉధృతిలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన స్టోన్ శిల్పి కళాకారుడు యన్నం ఉమేష్, వారి కుటుంబ సభ్యులకు సీనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎన్నారై సతీష్ దర్భ సహకారంతో.. అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ ఆయన సతీమణి శైలజతో కలసి 25వేల రూపాయలు, 5 వేల రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను అందజేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్గాన్ యాడ్స్ అధినేత దండ లక్ష్మణరావు తో కలిసి అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు రమేష్ మాట్లాడుతూ కళాకారులుగా కలసి పనిచేసి వారు ఆపదలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసిగా ఈ నేల మీద తిరిగాను, ఇక్కడి గాలి, నీరు సేవించాను. నాకు ప్రాణం పోసిన ఈ ప్రాంతం వాసులు ఆపదలో ఉంటే ఎలా మర్చిపోగలనని అన్నారు. మిమిక్రీ కళాకారుడుగా పేదరికం నుండి అనేక కష్టాలు, నష్టాలు చవిచూసి అంతర్జాతీయ స్థాయిలో అమెరికా వెళ్లి మిమిక్రీ కళాకారుడుగా మంచి పేరు తెచ్చుకున్నానన్నారు. అమెరికాలోని ‘సతీష్ దబ్బా’ ద్వారా సహాయం అందించేందుకు వచ్చానన్నారు. మున్నేరు వరద బీభత్వానికి అనేకమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేఫీ మానసిక వికలాంగుల కేంద్రంలో వస్తువులను పంపిణీ చేసి వారికి బిర్యాని ప్యాకెట్లను పంపిణీ చేసి చేయూతను అందించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking