ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అంగన్వాడి కేంద్రం1,2 నందు పోషక మాసం సందర్భంగా పోషకాహారం గురించి అందుబాటులో ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు పాలు తప్పకుండా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మరి తల్లులకు చెప్పడం జరిగింది.అలాగే మూడు సంవత్సరాలు పిల్లలకు అక్షరాభ్యాసం,కిశోర బాలికలకు,హెచ్ బి టెస్టులు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి దీపావహిని ఏఎన్ఎం సరస్వతి,అంగన్వాడి టీచర్లు శారద,సుగుణలత, ఆశ వర్కర్లు రాణి,మమత, పిల్లలు,తల్లులు, తదితరులు పాల్గొన్నారు.