ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : హైదరాబాద్ లోని ముఖ్య మంత్రి కనివాసంలో జరిగిన తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.కొండాలక్ష్మన్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27 వ తేదీన లక్ష్మణ్ బాపూజీ జన్మించారని తెలిపారు.1952 నుంచి పలుమార్లు శాసనసభ సభ్యునిగా పని చేసారని గుర్తు చేశారు.బాపూజీ విద్యాశాఖ మంత్రిగా పని చేసిన కాలంలో ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారని ప్రేమ్ సాగర్ రావు కొనియాడారు.