ప్రజాబలం ప్రతినిధి తార్నాక సెప్టెంబర్ 21:1969 లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనే తెలంగాణ కాంక్షతో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఓయూ జెఏసి చైర్మన్ బాలకృష్ణ నేత అన్నారు. ఈ మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉస్మానియాయూనివర్సిటీలని
ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నేత పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు తరాల ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బాపూజీ కలలు కన్న సామాజిక న్యాయం లేకుండా పోయిందన్నారు. ఆయన వేసిన ఉద్యమ బాటలో మున్ముందు తరాలు పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ర్ట అధ్యక్షుడు సలీం పాషా, విజేఎస్ అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్, వలిగొండ శ్రీనివాస్, ఈరెంటి విజయ్, బోనాల నగేష్, శేఖర్, రాపోలు వాసు, వర్కాల రవి, శ్రీనివాస్, క్రాంతి, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.