మెదక్ తూప్రాన్, సెప్టెంబర్, 2. ప్రజా బలం న్యూస్ :-
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు లోని 8వ సెంటర్ అంగన్ వాడీ కేంద్రం లో పోషణ మాసోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి భైరం ఉమా సత్య లింగం హాజరయ్యారు. కౌన్సిలర్ ఉమా సత్యలింగం మాట్లాడుతూ పిల్లల్లో శారిరక దృఢత్వం చెందాలంటే మంచి పోషకాలు వున్న ఆహారం అందించాలని, తల్లి పాల ప్రాముఖ్యత, ఆకు కూరలలో వున్న విటమిన్ల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం లో అంగన్ వాడీ సూపర్ వైసర్ సునీతా, అంగన్వాడీ టీచర్ రేణుక, ఆశా కార్యకర్తలు, ఎ ఎన్ ఎం, పీహెచ్ సి దుర్గారెడ్డి, మహిళలు, బాలింతలు పెద్ద మొత్తం లో పాల్గొన్నారు.