ఆ బంకులో వినియోగదారులకు విలువలేదు..!

పిక్ అవర్స్లో ఇబ్బందులు

సిబ్బంది జంప్

ఇబ్బందుల్లో ప్రజలు

జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 2,(ప్రజా బలం) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించాలని అదేశాలిస్తున్నా జగిత్యాల లోని ఓ పెట్రోల్ బంకులో ప్రతిరోజు వినియోగదారులకు అవమానాలు, సేవా లోపాలు నిత్యం ఎదురవుతున్నాయి. జగిత్యాల లోని ధర్మపురి రోడ్డులో హెచ్. పి పెట్రోల్ బంక్ అబద్ధాల నడుమ పుట్టిన ఈ పెట్రోల్ బంకులో పెట్టిన పెట్టుబడులు పుట్టించిన వివాదాలు కొందరికి ప్రాణాపాయమైంది. ఇలాంటి నేపద్యంలో ఈ బంకుకు వచ్చిన వినియోగదారుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. పెట్రోల్ కోసం వచ్చిన వినియోగదారుడికి సరియైన రీతిలో సేవలు అందించాల్సిన అక్కడి సిబ్బంది వినియోగదారుపట్ల నిర్లక్ష్యం తోపాటు చులకన భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు వినియోదారులు ఆరోపిస్తున్నారు. ఆయా బంకులలో వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపే రీజనల్
మేనేజర్లను మేనేజు చేసేందుకు జగిత్యాల మాజీ మునిసిపల్ చైర్మన్ కొడుకు ఒకరు వ్యవహరిస్తారన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు తూనికలు కొలతల విభాగం అధికారులకు ఇచ్చే ముడుపులు కాస్తా ఈ అధికారులను పెట్రోల్ బంకుల దరికి చేస్తాకుండా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడి నుంచి తెచ్చుకోవడం కోసం సదరు పెట్రోల్ బంకు కు చేరుకొంటే అక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటుందని వినియోగదారులు అంటున్నారు. దీనికి తోడు ఒకే వ్యక్తి పెట్రోల్ పోయడం అదే వ్యక్తి డబ్బులు తీసుకోవడం అందులోనూ నిర్లక్ష్యం వినియోగ దారుల్లో ఆగ్రహానికి దారితెస్తోందని పలువురు అంటున్నారు. అలాగే పవర్ పెట్రోల్ పోసుకొని పొదామని వినియోగదారులు ఆలోచించినా అక్కడ సిబ్బంది ఉండరని అంటున్నారు. వీరందరి వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి రీజనల్ సేల్స్ మేనేజర్ నెంబర్ ను అక్కడ రాయకపోవడం తోనే ఆ బంకు నిర్వహణపై వినియోగదారుల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవానికి ప్రతి పెట్రోల్ బంక్ తో పెట్రోల్ సరఫరా సంస్థకు నెట్ వినియోగం ఉంటుందన్న సమాచారం. ఇంతటి ప్రతి పెట్రోల్ చుక్కను లెక్కించే హెచ్. పి. పెట్రోల్ సంస్థ కు చెందిన జగిత్యాల లోని ఒక బంకులో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీనికితోడు జగిత్యాల జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు వాస్తవంగా బిజీగా ఉంటారనే అపవాదు ఉండగా ఇలాంటి శాఖకు పెట్రోల్ బంకులపై పూర్తి అజమాయిషీ కూడా వినియోగదారులకు ప్రతిరోజు ఇబ్బందులే అన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking