నెహ్రూ,అంబేద్కర్ వంటి గొప్ప ప్రసిద్ద వ్యక్తుల అడుగు జాడల్లో నడవాలని సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 02 : విద్యార్థినులందరూ న్యాయపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండి, బాగా చదువుకుని తమ జీవితాల్లో విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని,పండిట్ నెహ్రూ,అంబేద్కర్ వంటి గొప్ప ప్రసిద్ధ వ్యక్తుల అడుగుజాడల్లో నడుస్తూ,విద్యార్థినులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అసదుల్లా షరీఫ్ విద్యార్థినులకు పిలుపునిచ్చారు.స్థానిక లక్షెట్టిపేట గురుకుల సాంఘిక సంక్షేమ కళాశాలలో విద్యార్థినులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి,లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ…పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని,మరికొన్ని ముఖ్యమైన అంశాలను పిల్లలతో పంచుకోవడానికి తప్పకుండా మరోసారి ఈ పాఠశాలను సందర్శిస్తానని కూడా పేర్కొన్నారు.అదేవిధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ విద్యార్థినులకు ముఖ్యమైన చట్టాలను వివరించి, అవసరమైనప్పుడు సందర్భానుసారంగా వాటిని ఆచరణలో పెట్టేందుకు విద్యార్థినులు స్వయంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయ సలహాదారులందరూ ఒక్కొక్కరుగా,విద్యార్థి నులకు వివిధ రకాల చట్టాలు, న్యాయశాస్త్రాలపై అవగాహన కల్పించారు.
ప్రిన్సిపాల్ ఎం.లలిత కుమారి మాట్లాడుతూ…జడ్జి పాఠశాలలను సందర్శించడం,తమ విద్యార్థినులకు న్యాయపరమైన అంశాలపై విస్తృత అవగాహన కల్పించడం చాలా సంతోషాన్ని కలిగించిందని,అలాగే న్యాయవాదుల బృందం కూడా ఎన్నెన్నో అంశాలను తెలియజేయడం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వర్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా,కళాశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహమ్మద్ అసదుల్లా షరీఫ్,లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పలు రకాల మొక్కలను నాటారు.హరితహారం కార్యక్రమంలో అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ ఏం.లలిత కుమారి,సిబ్బంది,విద్యార్థినులు కూడా పలు మొక్కలు నాటినారు.ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణలో చెట్లు మనకు విలువైన వస్తువులనీ,
వీటిని కాపాడుకున్నట్లయితేనే భవిష్యత్ తరాల వారు పర్యావరణహితమైన పరిస్థితులలో జీవించగలరనీ కూడా ఇందు కొరకై విద్యార్థి దశ నుండే చెట్లను పెంచడం పై ఆసక్తి,అవగాహన కలిగి ఉండాలనీ ఎం.లలిత కుమారి ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.