రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 02: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భూగర్భ జలాలు మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి అమృత హస్తాలతో పఠాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కార్దనూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు అందులో భాగంగా ఆత్మగౌరవంతో బతకాలనే పేదల కలల సాకారం అని, ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిలో రాజేంద్రనగర్ నియోజక వర్గానికి మొదటి దాపాలో 500 మందికి ఇవ్వడం జరిగిందని శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ పేర్కొ0టు హైద్రాబాద్ మహా నగరంలో పేదోడి సొంత ఇంటి కల సాకారం చేస్తూ ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేసి పేదలను ఆదుకున్న గొప్ప నాయకుడు మన ముఖ్య మంత్రని గుర్తు చేశారు. అలాంటి మన గొప్ప నాయకుడిని మనం మర్చిపోవద్దని, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాల రూపకల్పన అయన సొంతమని మున్ముందు ఇలాంటి పథకాల కోసం మళ్ళీ కెసిఆర్ నాయకత్వన్నీ బలపరుస్తు ముచ్చటగా మూడోసారి ముఖ్య మంత్రిని చేసే అవకాశంను ఎవ్వరూ వదులుకోకుండా ముందుకు రావలసిందిగా కోరారు.
