అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 28:
పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా హసన్పర్తి మండలం సిద్దాపూర్ అంగన్వాడి సెంటర్ల లో టీచర్ లక్ష్మి, టీచర్ స్రవంతి, హరిచంద్ర నాయక్ తండ అంగన్వాడి సెంటర్లో టీచర్ రత్న ఆధ్వర్యంలో చిరుధాన్యాల గురించి వాటినుండి అందే పోషణ గురించి గర్భిణీ మహిళలకు, యుక్త వయస్సు మహిళలకు బాలికలకు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ లక్ష్మీ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడి పరిధిలో గల మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను తెలియజేయడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking