ఉమ్మడి మెదక్ మార్చి:28 ప్రజ బలం ప్రతినిధి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మెదక్ జిల్లా అధ్యక్షునిగా పోతురాజు రామయ్య ను నియామించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ఆదేశానుసారం నియామక పత్రాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి చేతుల మీదుగా మంగళవారం రోజు అందజేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు మెదక్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు గాను, రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, టీజేయు సిద్దిపేట జిల్లా కార్యదర్శి సిద్దల రవి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.