భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 29,30, 31 తేదీల్లో భద్రాచలం విచ్చేయు భక్తుల రద్దీ దృష్ట్యా భారీ వాహనాలు,గూడ్స్ వాహనాలు మరియు ఇతర పెద్ద వాహనాలను పట్టణంలో రాకుండా నిషేధించడం జరుగుతుందని ఈ రోజు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు.భారీ గూడ్స్ వాహనాలు అత్యవసరమైతే తప్ప పట్టణంలో రాకుండా పోలీసువారి ఆంక్షలను గమనిచవలసినదిగా కోరారు.కళ్యాణం,పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాల సందర్భంగా మిథిలా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున ఈ విధమైన నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు.ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూఆర్ కోడ్ ను మరియు ఆన్లైన్ లింకు (https://bhadrachalam.netlify) ను రూపొందించడం జరిగిందని తెలియజేసారు.కావునా ఈ మూడు రోజులపాటు భద్రాచలం పట్టణానికి విచ్చేసే భక్తులు,వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.