ఖమ్మం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) భద్రాచలం పట్టణానికి చెందిన బొల్లి వెంకట రాజు – సుజాత ల మనవడు చి. ఆర్యాన్ష్ మొదటి
పుట్టినరోజు వేడుకలు గోదావరి ఇన్ ఫంక్షన్ హాల్ భద్రాచలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా చిరంజీవిగా ఉండాలని మల్లిబాబు గారితో పాటు పాల్గొన్న పెద్దలు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో,దంపతులు చరణ్ రాజు -రమ్యశ్రీ వల్లపు యాకయ్య, కోదాడ శ్రీను,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాదవ సంఘం నాయకులు పుట్ట ఉపేందర్, యాదవ్,చింతల వెంకయ్య, వెంకటేశ్వరరావు,రాము తదితరులు పాల్గొన్నారు