రాజన్న సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ లోకనాథంపాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈవో వినోద్ , అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం, స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు మహాశివరాత్రి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందించిన ఈ మహద్భాగ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదే విధంగా, శృంగేరి శారదా పీఠం తరఫున రాధాకృష్ణ శర్మ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రాక్ష మాలను సమర్పించారు. ఆలయ ఈవో వినోద్ , అర్చకులు ఆయనను స్వాగతించి, స్వామివారి సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి కృపతో భక్తులకు అభీష్ట సిద్ధి కలగాలని అర్చకులు ఆశీర్వదించారు.
Prev Post