జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 : ఈ నెల 27వ తేదీన జరగనున్న,మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ లో జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు/సంస్థలు/ ప్రభుత్వ పాఠశాలలు/ విద్యా సంస్థలకు ఈ నెల 27న పోలింగ్ రోజు,26న పోలింగ్ ముందు రోజు,మార్చ్ 3వ తేదీ కౌంటింగ్ రోజులలో వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు.