ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 26: స్థానిక గోదావరి ప్రాంతంలో ఉచిత మజ్జిగ పంపిణి కర్యక్రమం చెయ్యడం జరిగింది.ఈ సందర్బంగా యూనియన్ ప్రెసిడెంట్ బోనగిరి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ…సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహా శివరత్రి పండగ ను పురస్కరించుకొని యూనియన్ అంతా కలసి భక్తులకు అందరికి ఎదో ఒక సాయం చేయాలనే ఉద్దేశం తో గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ఉచిత మజ్జిగ పంపిణి చేస్తున్నాము అన్నారు. తరువాత వైస్ ప్రెసిడెంట్ కల్లేపల్లి విక్రమ్ మాట్లాడుతూ…అందరికి శివరత్రి శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా భక్తులు అందరూ పుణ్య స్నానము ఆచరించిన తరువాత అలసిపోయిన భక్తులు మజ్జిగ త్రాగి కొంచెం సేద తీర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్స్ బడుగు రాజేష్,కార్యదర్శి కొప్పుల నరేష్,చందు,కిరణ్, దర్మేందర్,శివ,కిరణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.