నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించాలి.

 

డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ సమస్యలు పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే.

రాజన్న సిరిసిల్ల, ( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రోజున మినీ కాన్ఫరెన్స్ హాల్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ.
మొదటగా పోలీస్ స్టేషన్ల వారీగా నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్స్ కేసులు, మిస్సింగ్ కేసులు, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించిన సమాచారంతోపాటు, పెండింగ్ కేసులు వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు, నేరాల నియంత్రణ కోసం పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని, పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు చేదించాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టి కేసుల దర్యాప్తులో మరింత నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పెండింగ్లో ఉన్న కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని, నేరాల చేదనలో సాంకేతిక పరి జ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరితగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్లో పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking