గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న అధికారులు

 

హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం విలేకరి జనవరి 19

కమలాపూర్ మండలం కన్నూరు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం శుక్రవారం గ్రామానికి వచ్చిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది ప్రారంభోత్సవం చేయకుండా అడ్డుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం ప్రారంభించకుండా ఉండాలని దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అధికారుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా అంగీకరించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నియోజకవర్గంలోని గ్రామాలలో గ్రామ కార్యాలయాలు నిర్మించామని అన్నారు. ఈనెల 31న సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో గ్రామ కార్యాలయాలను వారి హయాంలోని ప్రారంభించాలని ఉద్దేశంతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలుపెట్టామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా మంత్రులతో మాట్లాడదామని చూసినప్పటికీ వారు స్పందించకపోవడంతో సమయం ముగుస్తుందని ప్రారంభోత్సవానికి సిద్ధమయమన్నారు. ఇప్పుడు పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ఆగుతున్నానని,, వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి ఈనెల 24 లోపే ప్రారంభోత్సవ తేదీలను స్పష్టంగా ప్రకటించాలని అన్నారు. ప్రారంభోత్సవ తేదీలు కూడా ఈనెల 30లోపే ఉండాలన్నారు. ఒకవేళ ప్రారంభోత్సవానికి ఈనెల 24లోపు స్పష్టత రాకపోతే ఎవరు అడ్డుకున్న ఎమ్మెల్యేగా నేనే స్వయంగా వాటి ప్రారంభోత్సవాలు చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, సీనియర్ నాయకులు తిరుపతిరావు, సత్యనారాయణ రావు, ఎక్స్ జెడ్పిటిసి నవీన్, ఇంద్రసేనారెడ్డి, కన్నూరు గ్రామ సర్పంచ్ రామారావు, ఎంపిటిసి భాస్కరరావు, యూత్ నాయకులు దుర్వేశ్ దిలీప్ శ్రావణ్ కుమార్ యాదవ్ అఖిల్ మాట్ల రాజ్ కుమార్ దినేష్ అశోక్ ప్రశాంత్, ముజ్జు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking