ప్రజావాణి వివిధ సమస్యలపై ప్రజల నుండి184 దరఖాస్తులు స్వీకరణ
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం తత్సారం చేయరాదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎన్నో వ్యయప్రసాయాలకోర్చి సమస్యలు తీరుతాయని దూరప్రాంతాల నుంచి వస్తుంటారని వారి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు వాటిని పరిష్కరించాలని సూచించారు.
ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించి వాటిని అధికారులకు అందచేశారు.
ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి ( 48) దరఖాస్తులు రాగా, పెన్షన్ కు సంబంధించి (20) దరఖాస్తులు వచ్చాయని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు(47) దరఖాస్తులు,
జీవనోపాధి సమస్యలపై (05) రాగాఇతర సమస్యలు (64) దరఖాస్తులు మొత్తం 184 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు
ఈ కార్యక్రమంలోడి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.