ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా మాజీ ఎమ్మెల్యేకు జ్ఞానోదయం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు పూదరి,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,మహిళ అధ్యక్షురాలు హేమలత

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా మాజీ ఎమ్మెల్యేకు జ్ఞానోదయం కావడం లేదని

కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు పూదరి,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,మహిళ అధ్యక్షురాలు హేమలత

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 08 : ప్రజాప్రతినిధి గా పనికిరావంటు ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా నడిపెళ్లి దివాకర్ రావుకు జ్ఞానోదయం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించారు.సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత మాట్లాడారు.ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.ఆకాశరమన్న పేరుతో ఎమ్మెల్యే పై నిందారోపణలు చేస్తూ మెయిన్ రోడ్ లో పంచిపెట్టడం దివాకర్ రావు ఆయన తనయుడు విజిత్ రావు హస్తం ఉందన్నారు. లేఖలపై పోలీసు లు విచారణ జరుపుతున్నారని ఆకాశరామన్న దొరుకుతాడని వారు చెప్పారు. గుండాలు, భూకబ్జాదారులను పెంచిపోషించింది ఆ ఇద్దరు నేతలు కాదా అని ప్రశ్నించారు. భూకబ్జా కేసులో వారి అనుచరుడు తాజాగా అరెస్టు అయ్యాడని గుర్తు చేశారు. గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రి ఆసుపత్రి నిర్మించి కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేయడమే కాకుండా రోగులకు ఉపయోగం లేకుండా చేసిన ఘనత దివాకర్ రావుది కాదని వారు నిలదీశారు. ఐబి స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం కు ఎమ్మెల్యే చర్యలు తీసుకోగా దివాకర్ రావు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.20 యేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావు మంచిర్యాలలో ఏ మేరకు అభివృద్ధి చేశారో నిరూపించాలని వారు సవాలు చేశారు.ఎమ్మెల్యే అయినా కొద్ది రోజుల్లోనే ప్రేమ్ సాగర్ రావు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జీవోలు తీసుకురానున్నారని వారు తెలిపారు.ప్రేమ్ సాగర్ రావు వ్యాపారం చేసుకుంటూ మంచిర్యాలలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని దివాకర్ రావు మాదిరిగా ఎన్నికల స్టెంట్ లో భాగంగా ట్రస్టు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఎన్నికలో ఒడిపోగానే ట్రస్టు జెండా ఎత్తివేశారని విమర్శించారు. ప్రేమసాగర్ రావుపై నిందారోపణలు చేస్తే సహించేదిలేదని వారు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking