ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 26: నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయుచున్న సందర్భంగా ఇంటలిజెన్స్ సెక్యూరిటి వింగ్ ఎస్.పి రామకృష్ణ నల్సార్ యూనివర్సిటిలో ఏర్పాట్లను పర్యవేక్షించి సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన మేరకు సూచనలు అందించారు.
ఈ నెల 28న నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి విచ్చేయున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం నల్సార్ యూనివర్సిటి లో నిర్వహిస్తున్న ఏర్పాట్లను డిసిపి కోటిరెడ్డితో కలసి ఇంటలిజెన్స్ సెక్యూరిటి వింగ్ ఎస్.పి రామకృష్ణ పర్యవేక్షించారు. సంబంధిత శాఖల అధికారులు నిర్వహిస్తున్న పనులను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు తెలియజేసారు. రోడ్లు మరమ్మత్తులు, రెడ్ కార్పెట్లు, నిరంతరాయ విద్యుత్తు, పుష్పలంకారణ, వైద్య శిబిరాలు, అంబులెన్సు, సీటింగ్, మోబైల్ టాయిలెట్స్, పాసులు వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేస్తుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయాలని ఎస్.పి. తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, శామీర్ పేట్ తహాసీల్దారు యాదగిరిరెడ్డి, అర్ అండ్ బి, పోలీసు, వైద్య, విద్యుత్తు, పర్యాటక శాఖల, పౌర సంబంధాలు, అధికారులు,