……….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ఫిబ్రవరి 20 ప్రజ బలం ప్రతినిధి
ఈనెల 25న సంగారెడ్డి పట్టణంలో
జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంపు ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 25న సంగారెడ్డి లోని సెంట్ ఆంటోనీ డిగ్రీ కళాశాలలో ఉదయం 9:00 గంటల నుండి 3:00 గంటల వరకు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇట్టి కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కంటి వెలుగు శిబిరానికి తమ ఐడి కార్డ్, ఆధార్ కార్డుతో వెళ్లి కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
ఈ సదవకాశాన్ని సంగారెడ్డి నియోజకవర్గ పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.