ప్రజావాణికి 29 ఆర్జీలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 20: ప్రజ బలం ప్రతినిది:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ( 29) దరఖాస్తులను
కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఆర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఇచ్చి,ఆయా శాఖల అధికారులు జాప్యానికి తావివ్వకుండా తమ పరిధిలో పరిష్కరించ గలిగినవి వెంటనే పరిష్కరించాలన్నారు.
రెవెన్యూ శాఖకు సంబంధించి 12 అర్జీలు రాగా, నీటిపారుదల, పంచాయితీ, ఉద్యాన, మహిళ శిశు వికలాంగుల సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి, హౌసింగ్, కార్మిక, విద్య, సివిల్ సప్లై స్, మత్స్య, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి 17 అర్జీ లు వచ్చాయి.
భూ సమస్యల పరిష్కారం,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరీ,ఆసరా పింఛన్లు,స్వయం ఉపాధి కల్పనకు రుణం మంజూరీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి,
తదితరాలపై అర్జీ దారులు దరఖాస్తులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, నారాయణఖేడ్ సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టరేట్ ఏ ఒ, తదితరులు పాల్గొన్నారు.