వేతనాలు పెంచాలని వినతి పత్రం అందజేత.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : వేతనాలు చెల్లించాలని ఐకేపి వి.ఏ.ఓ లు స్థానిక ఎమ్మార్వో జ్యోష్ణకి వినతిపత్రం అందజేశారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేతనాలు పెంచాలని జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి వెంకటేష్ మాట్లాడారు.ఈ సందర్భంగా లింగంపల్లి వెంకటేష్ మాట్లాడుతూ….గ్రామ స్థాయిలో విఏఓలుగా మహిళల అభ్యున్నతి కోసం గత 18 సంవత్సరాల పాటు వెట్టిచాకిరి చేస్తున్నామన్నారు. కేవలం 3900 రూపాయల తో కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు.సుప్రిం కోర్టు తీర్పు
ప్రకారం కానీస వేతన చట్ట ప్రకారం 26,000 రూపాయలు చెల్లించాలని,ఇన్స్ రేన్స్ ఐడి కార్డ్ లు,అదే విధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అకౌంట్స్ లో గౌరవ వేతనం జమ చేయలన్నారు. సాదరణ భీమా 25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డి.రమేష్,వేంకటేష్,కళావతి,డి.శారద,బి.అనిత,లచ్చన్న,చంద్రకళ, లక్ష్మి,సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking