శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి నీ దర్శించుకున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ శ్రీమతి మోతె శ్రీలత శోభన్‌ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు..

 

ఉప్పల్‌ ప్రజాబలం ప్రతినిధి:మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ శ్రీమతి మోతె శ్రీలత శోభన్‌ రెడ్డి మరియు బీ ఆర్‌ ఎస్‌ కార్మిక విభాగ అధ్యక్షుడు శ్రీ మోతె శోభన్‌ రెడ్డి కుటుంబ సమేతంగా ఆ పరమేశ్వరునికి వేద పండితులచే ఏకావర శ్రీ రామలిగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు శివుని ఆరాధనకు అత్యున్నతమైన రోజు అని, శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ పరమశివుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking