చంద్రాయణగుట్టా ప్రజాబలం ప్రతినిధి:వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం 11,06,83,571 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా , డీజీపీ జితేందర్ , ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి , పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మంచి ఆశయంతో ముందుకొచ్చి సహాయాన్ని అందించిన పోలీసు శాఖకు ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలియజేశారు.