జూబ్లీహీల్స్ ప్రజాబలంప్రతినిధి:వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సీఎం రేవంత్‌రెడ్డి శాలువ కప్పి బోకే ఇచ్చి సన్మానించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
