–
– బంజారుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్
– సంత్ సేవాలాల్ మహారాజ్ గారి దీవెనలు ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి
– రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 29:ఈరోజు హైదారాబాద్ కొంపెల్లి లో సంత్ సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని అన్నారు. ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అహింసా మార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను
గుర్తెరిగి ముందుకు సాగాలని మంత్రి వర్యులు సీతక్క గారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో పాటు జిల్లా నాయకులూ, తదితరులు పాల్గొన్నారు