ముంపు ప్రాంతాల రక్షణకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి :: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

 

: – జిల్లాలోని ముంపు ప్రాంతాల రక్షణకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 29: బుదవారం గోవిందరావు పేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి షభరిష్ తో కలిసి సందర్శించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత వర్షం కాలంలో కురిసిన భారీ వర్షాలను అంచనా వేసి ప్రాజెక్ట్ నగర్ గ్రామం ముంపుకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై గ్రామస్తులతో మాట్లాడారు, వాటికి సంబంధించిన పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసి తమకు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వెంటనే పనులు ప్రారంభం ఔతాయని, ఎవరు అదోళన చెద్దవద్దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ కే.నారాయణ, గోవిందరావు పేట మండల డి ఈ సి హెచ్ శ్రీనివాస్ , తాడ్వాయి మండల డి ఈ సదయ్య , ఏ ఈ హర్షద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking