ఉపాధి హామీ పథకం పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.

– పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 29: ఉపాధి హామీ పథకం పనులను జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేసి పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కూలీల హాజరు పట్టిక, పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ, తదితర మౌలిక సదుపాయాల కల్పన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం ఐలాపురం గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యులకు జీవన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపరచుకోవాలో పలు సూచనలు చేశారు. ఐలాపురం గ్రామంలోని భీమ్ చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన పాఠశాలను, ఐటీడీఏ ఆశ్రమం పాఠశాలల పరిస్థితులను పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరంలోపు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని, గ్రామంలో పారిశుధ్య పనులు నిరంతరం జరగాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈజీఎస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking