– అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి :: జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.

 

– గడువు లోపు ఏకరూప దుస్తులు సిద్ధంగా ఉండాలి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 29: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గడువులోపు ఏకరూప దుస్తులు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, డీఈవో పాణిని, ఐటీడీఏ డీడబ్ల్యూ పొంచం లోతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని , ఏకరూప దుస్తులు గడువులోపు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు పూర్తయ్యాయని, మిగతా పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మతుల పనులను సకాలంలో త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ప్రధానంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సమావేశం లో డి డబ్ల్యు ఓ స్వర్ణలత లెనిన్, డిసిపిఓ ఓంకార్, ఏఈలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking