రైతు భీమా కోసం నమోదుకు అవకాశం లక్షెట్టిపేట ఏ ఓ ప్రభాకర్ రెడ్డి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని రైతులకు 6వ విడత రైతు భీమా పథకంలో రైతుల నమోదుకు ఆగష్టు 5 వరకు గడువు ఉందని,ఈ అవకాశంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఏ ఓ మాట్లాడుతూ…ఈ పథకం లో 04.08.2023 లోపే రైతు భీమా లో కొత్తగా పట్టా పాసు పుస్తకం వచ్చిన రైతులు అలాగే పట్టా పాసు పుస్తకం ఉండి ఇప్పటి వరకు నమోదు చేసుకొని అర్హత కలిగిన ప్రతి రైతు నమోదు చేసుకోవాలన్నారు.రైతు భీమా నమోదు కోసం పట్టాదారు వయసు 18-59 ఏళ్ళు (14.08.1964 నుండి 14.08.2005 వరకు) ఉండాలన్నారు.పట్టాదారు పాస్ పుస్తకం నకలు,పట్టాదారు ఆధార్ కార్డ్ నకలు,నామినీ ఆధార్ కార్డ్ నకలు,రైతు బీమా నమోదు దరఖాస్తుతో అందజేయాలన్నారు.రైతే స్వయంగా వచ్చి రైతు భీమా ధరకాస్తు ఫారం ను ఏ ఈ ఓ లకు అందజేయాలన్నారు. రైతు భీమా చేసుకొని ఎల్ ఐ సీ నెంబర్ కలిగి ఉన్న రైతులు ఎవరైనా నామినీ మార్పు లేదా ఏదయినా మార్పు చేసుకొనే రైతులు స్వయంగా వచ్చి మార్పు చేసుకోవాలని కోరారు. మండలంలోని గడువు లోపు రైతు భీమా నమోదు చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న భీమా సదుపాయాన్ని పొందాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking