ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్
హైదరాబాద్ జూలై 26 ( );ప్రజలకు ఉచిత విద్యా వైద్యం ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యమని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ తెలిపారు. బుధవారం తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పి వినయ్ కుమార్ ను జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత విద్య వైద్యం పైనప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు డాక్టర్ వినయ్ కుమార్ కూడా ఉచిత వైద్యం విద్య వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో ఐపీసీ మీడియా వింగ్ అడ్వైజర్ సూర్య ప్రకాష్కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి ఐపీసీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ నంది కొండలరావు తదితరులు పాల్గొన్నారు