ఆగస్టు 5న వికారాబాద్ జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం

వికారాబాద్ జూలై 26 (): ఆగస్టు 5న 2023 వికారాబాద్ జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆగస్టు 5 శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, సద్గురు సాయిరాం హాస్పటల్, ఆలీ బాగ్, వికారాబాద్ నందు నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదనపు జిల్లా కలెక్టర్ లింగ్యా నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాల గురించి చర్చ తదుపరి వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో నమోదు కాబడిన 574 మంది సభ్యులు ఉన్నారని, వారిలో నుండి (10) మందిని నూతన మేనేజింగ్ కమిటీ సభ్యులు గా ఎన్నుకొంటారని, కావున వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని సాయి చౌదరి ఒక ప్రకటనలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking