రాజన్న సిరిసిల్ల జిల్లా 20 డిసెంబర్ 2023ప్రజాబలం ప్రతినిధిరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో యదేచ్చగా ఫుట్ పాత్ ను దుకాణ యజమానులు ఇష్టానుసారంగా వాడతున్నారు .కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు, పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ మీదుగా పాత బైపాస్ వరకు ఏర్పాటు చేసిన ఫుడ్ పాత్ ను ఇష్టానుసారంగా వాడుతున్నారు ఫుట్ పాత్ పై ప్లెక్సీ స్టాండ్లతో, ఫ్లెక్సీలతో ఫ్లెక్సీ బోర్డులతో , అయ్యా షాప్ వస్తువులు అడ్డం పెట్టేసి నడవడానికి వీలు లేకుండా చేస్తున్నారు పాదచారులకు అసౌకర్యం ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రజల సౌకర్యార్థమై ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ను దుకాణ యజమానులు ఇష్టానుసారము ఆక్రమిస్తూ పాదచారులకు ఇబ్బందులు కలగచేస్తున్నారు దీంతో ప్రజలు ఫుట్ పాత్ లపై నడిచే బదులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటిపై వెంటనే అధికారులు స్పందించ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు