వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని OU జేఏసీ డిమాండ్

 

ఈరోజు OU జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ..
ఈ సందర్బంగా మాట్లాడుతు వట్టే జానయ్య యాదవ్ ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వాడు, కష్ట పడి పైకి వచ్చినాడు. ఆనాడు మంత్రి గారు ఒత్తిడి చేసి నీవు మా పార్టీ లోకి వస్తే అన్ని విధాలుగా సహకారం చేస్తాము అని, నమ్మపలికి పార్టీ లోకి తీసుకున్నది వాస్తవం కదా ! అని మేము అడుగుతున్నాము. ఆరోజు నుండి పార్టీ కోసం, మంత్రి గారి గెలుపు కోసం కృషి చేసింది వాస్తవం కదా ! 9సంవత్సరాలు నీతోనే నడిచి, నీ అనుచరుడు గా చాలామణి అయింది వాస్తవం కదా! అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎలా వచ్చాయి. కుట్ర చేసి కేసులు పెడుతున్నారు. ఒక బీసీ బిడ్డ యాదవ సామజిక వర్గానికి చెందినవాడు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు. బేషరతుగా అక్రమ కేసులు ఎత్తివేయాలి. పీడీ యాక్టు వంటి కేసులు పెడదాము అని ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఆలోచనలు మానుకొని జానయ్య యాదవ్ ని వారి కుటుంబ సభ్యులకు
ఆప్ప జెప్పాలని కోరుతున్నాము. జానయ్య యాదవ్ పై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని లేకుంటే త్వరలో బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఉద్యమం చేస్తారని, ఛలో సూర్యాపేట పేరు తో వారి కుటుంబానికి సంఘీ భావం తెలియజేసి సభను నిర్వహించడం జరుగుతుంది అని, రాబోయే ఎన్నికలలో మంత్రి గారిని ఓడించడం ఖాయం అని, బహుజనుల పై నీ అరాచకాలు, అపి వేయాలని అన్నారు . జానయ్య యాదవ్ గారికి ప్రజలలో ఆదరణ లేకపోతే ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపిపి, సింగిల్ విండో చైర్మన్, కౌన్సిలర్, ఉమ్మడి నల్గొండ జిల్లా DCMS చైర్మన్ గా ప్రజల చేత ఎలా ఎన్నుకోబడతారు. మీరు దొంగ బాధితులనూ సృష్టించి అతని పై లేనిపోని కేసులు పెడుతున్నారు అన్నారు. జానయ్య యాదవ్ తప్పు చేస్తే నిరూపించి చట్టం పరం గా చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు. గతంలో జానయ్య యాదవ్ పై సుపారీ గ్యాంగ్ తో హత్య కు ప్లాన్ చేసిన వ్యక్తులను నువ్వు పక్కన పెట్టుకున్నావు నువ్వు హత్య రాజకీయాలు చేస్తున్నావు. సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు నోముల శేషు, యాదవ్, శ్రీకాంత్ యాదవ్, పాల్వాయి నగేష్, వంశీ, సైదులు మరియు షిప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్,
బినవేని మల్లేష్ యాదవ్, దాసరి నాగేష్ యాదవ్, సిద్ధి రమేష్ యాదవ్,వెంకటేష్ గౌడ్,గంగుల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking