కూకట్పల్లి (ప్రజబలం)మార్చ్ 21:
మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పుడే నిజమైన సమానత్వం మరియు న్యాయం సాధించబడతాయి ఇందిరా ఫెలోషిప్ తెలంగాణ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి,
మల్కాజిగిరి పార్లమెంట్ ఇందిరా ఫెలోషిప్ బూట్ క్యాంపు ఇందిరా ఫెలోషిప్ కన్వీనర్ విజయలక్ష్మి, రమణి రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేట్ లోని తాతచారి నగర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బూట్ క్యాంప్ గొప్ప విజయాన్ని సాధించింది. బూట్ క్యాంపు కి ముఖ్య అతిధిగా విచ్చేసిన సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమ, శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఇందుమతి శ్రీరంగం, జాతీయ పరిశోధనా అధిపతి హానికా రేషే ఏఐసీసీ, మేడ్చెల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజానోళ్ళ లక్ష్మి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ హాజరు కావడం ద్వారా ఈ కార్యక్రమం మరింత సుసంపన్నమైంది. ఇందులో ప్రముఖ అతిథి ఆహ్వానితుల నుండి శక్తివంతమైన మరియు ప్రేరణాత్మక ప్రసంగాలు చేసారు. సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి కోట నీలీమా తన మాటలతో హాజరైన వారిని ప్రేరేపించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు ఇందు శ్రీరంగం మహిళలను శక్తివంతం చేయడం మరియు మహిళలకు నిజమైన నాయకత్వం అనే తన అద్భుతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. సమాన హక్కులు యాజమాన్యం అనే ఆలోచన ఆధారంగా మహిళా కేంద్రీకృత రాజకీయాలను బలోపేతం చేయడం, అట్టడుగు స్థాయి మహిళా రాజకీయ నాయకులను సృష్టించడం శక్తి అభియాన్ లక్ష్యం అని అన్నారు. ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంలో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారి సమిష్టి కృషి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వారందరికీ చిరస్మరణీయమైన ప్రభావవంతమైన అనుభవంగా మార్చింది. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా మహిళా బ్లాక్ అధ్యక్షురాళ్లు, డివిజన్ మహిళా అద్యక్షులురాళ్లు కృష్ణవేణి, రాధ, రజిత, జోజమ్మ, చంద్రకళ, జ్యోతి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.