తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా అభివృద్ధి పథంలో పయనిస్తున్న మన తెలంగాణ రాష్ట్రం. …జిల్లా కలెక్టర్ డా శరత్.
సంగారెడ్డి జున్ 05 ప్రజ బలం ప్రతినిది:
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ ప్రగతి, విద్యుత్ విజయోత్సవ వేడుకలు సంగారెడ్డి పి ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 10 వ సంవత్సరంలో కి అడుగు పెట్టి దశాబ్ద ఉత్సవాల సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు.గత స్మృతుల్లో కి వెళ్ళితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సంగారెడ్డిలో నేను జేసీగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ధాన్యం పండించే రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలంటే, మెదక్ పట్టణానికి వెళ్లి సమావేశం నిర్వహించవలసిన పరిస్థితి ఉండేది, సంగారెడ్డి ప్రాంతంలో ధాన్యం పండించే రైతులు చాలా తక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సాగుబడిలో పంజాబ్ రాష్ట్రాన్ని క్రాస్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రం లో విద్యుత్ కోతల వలన ఎండిన పంటలతో రైతులు, ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుకి అడ్డంగా నిలబడి నిరసన లు తెలిపేవారు. గత ప్రభుత్వాలు నీటి తీరువాలు వసూలు చేసేవి . పారిశ్రామిక వాడల్లో కంపెనీలు పవర్ హాలిడేస్ ప్రకటించేవి. .తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. జిల్లాలో మంత్రి హరీష్ రావు సారథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్నారు.
జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ 2014 ముందు జిల్లాలో ఆటో ప్రాంతాల్లో నక్సలైట్ ఏరియాలో లో వోల్టేజ్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న ము.జనరేటర్లతో విధులు నిర్వహించే వాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్ కొరత లేకుండా సరఫరా అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ చైర్మన్ చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్విజయలక్ష్మి,.అదనపు కలెక్టర్ వీర రెడ్డి ,ద్యుత్ సూపరింటెండెంట్ మాధవరెడ్డి, తదితర ప్రముఖులు ప్రజాప్రతినిధులు, రైతులు వినియోగదారులు పాల్గొన్నారు.