కేసీఆరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు
గంగపుత్రుల కులవృత్తిని పంచడమేంటి
గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంఘం అధ్యక్షులు తిరుపతి
జగిత్యాల ప్రతినిధి, జూన్ 5:(ప్రజా బలం) తర తరాలుగా, యుగయుగాలుగా చేపలు పట్టే జన్మహక్కు గంగపుత్ర గుండ్ల కులస్తులదని ఇదే మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా గంగపుత్రులకు తీరని అన్యాయం జరుగుతోందని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయనిధి ఫౌండేషన్ అద్యక్షులు సముద్రాల తిరుపతి అన్నారు. సోమవారం దుబాయ్ లో ఆ సంఘ సభ్యులతో తిరుపతి సమావేశం నిర్వహించారు. ఆ తదుపరి జగిత్యాల ప్రెస్ క్లబ్ కు ప్రకటన పంపారు. ఇందులో చేపలు పట్టే జన్మహక్కు గంగపుత్ర గుండ్ల కులస్తులకే ఉందన్నారు. ఇదే మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. కానీ గంగపుత్రుల జన్మహక్కు లో ముదిరాజ్ లతో పంచుకోవడం బాధాకరమన్నారు. మత్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ పదవిని పిట్టల రవీందర్ కు ఇవ్వడాన్ని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ ఎస్ పార్టీలోని గంగపుత్రులకు ఎవరికి ఇచ్చినా సంతోషించే వారమని తిరుపతి పేర్కొన్నారు. ఇప్పటికైనా గంగపుత్రుల గుండ్ల కులస్తుల జన్మహక్కును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అప్పుడే గంగపుత్రులకు న్యాయం జరుగుతుందని తిరుపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోకల శంకర్,కార్యదర్శి బోరే ఇందయ్య గంగపుత్ర, కోశాధికారి సముద్రాల నరేష్, మేడి రమేష్, గుమ్ముల శ్రీనివాస్, గౌరవ సలదారులు పల్లికొండ రాములు, బింగి రాజు, బోరే రాజన్న, హనుమంతుపల్లి అధ్యక్షులు బింగి పోషన్న, సభ్యులు కమలాకర్, రేకులపల్లి అధ్యక్షులు శేఖర్ కొండ్రు, పందిరి చంద్రయ్య పాల్గొన్నారు.