కాలుష్య నియంత్ర మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జూన్ 5 (ప్రజాబలం) కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయము కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 న గ్రీన్ ర్యాలీని, సింగరేణి మహిళా కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఐ.ఎం.ఏ హాల్ దాకా నిర్వహించినారు. ఈ యొక్క ర్యాలీని శ్రీ బి. రవీందర్ పర్యావరణ ఇంజనీర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర పరిశ్రమల అధికారులు, వారి ప్రతినిధులు మరియు సింగరేణి మహిళా కళాశాల లెక్చరర్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ప్రత్యేక ఉద్దేశ్యమైన “ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు” అనే అంశం పై అవగాహన సదస్సు ను శ్రీ టి. సీతారాం, జియం ఎ.ఎం.ఏ. హాల్ నందు నిర్వహించబడినది.

ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ ఇంజనీర్ శ్రీ బి. రవీందర్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ జిల్లాలో వాటి అమలును, పరిశ్రమలు మరియు ప్రజలు వారి దైనందిత జీవితములో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యలు గురించి వివరించినారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులుగా నారా లేదా గుడ్డ సంచులను వాడాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking