విధులను బహిష్కరించిన సింగరేణి ఐటి విభాగంలోని ఔట్ సోర్సింగ్ సర్వీస్ ఇంజనీర్స్ పనికి తగిన వేతనం ఇవ్వాలి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 25 : సింగరేణి వ్యాప్తంగా ఐటి విభాగంలో ఔట్ సోర్సింగ్ ద్వారా గత 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న దాదాపు 100 మంది సర్వీస్ ఇంజనీర్స్ కు పనికి తగిన వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారాని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.వారి సమస్యలను సదరు కాంట్రాక్టు సంస్థ గాని సింగరేణి యాజమాన్యం గాని ఎలాంటి చొరవ చూపకుండా కాలయాపన చేస్తూ వారి సమస్యల గురించి ప్రశ్నించిన సర్వీస్ ఇంజనీర్స్ ని ఉద్యోగుల నుండి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఈ నెల 24వ తేదీ సాయంత్రం నుండి విధులను బహిష్కరించారు. సింగరేణిలో ఉత్పత్తి అయిన బొగ్గును రవాణా చేయడంలో ఈ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం.వీరి సమ్మె వలన సింగరేణి బొగ్గు రవాణాలో అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం చొరవ చూపి వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు అందరూ కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking