ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం నేలకొండపల్లి వాసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో గ్రంధాలయ శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పి విజయ్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుండి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్కే పవన్ కుమార్ పర్యవేక్షణలో ఇన్ఫర్మేషన్ లిట్రసి ప్రోగ్రామ్స్ ఇన్ లైబ్రరీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ఏ స్టడీ అనే సిద్ధాంత గ్రంథానికి గాను డాక్టరేట్ పొందారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. విజయ్ కుమార్ 2011లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మణుగూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొదటి పోస్టింగ్ లో జాయిన్ అయ్యారు 2016 లో ప్రమోషన్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ లో నియమించబడ్డారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీలలో గల సదుపాయాలను ఆన్లైన్ రిసోర్సెస్ ను లైబ్రరీ సర్వీసెస్ ను కళాశాల గ్రంధాలయ అధికారులు ఏ విధంగా విద్యార్థులకు అందిస్తున్నారు, వనరుల సద్వినియోగానికి ఎలాంటి ఆన్లైన్ మరియు ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నారు అనే అంశాలపై పరిశోధనా గ్రంధాన్ని సమర్పించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంధాలయాల అభివృద్ధికి విద్యార్థుల ఉన్నత విద్యకు ఉద్యోగ సాధనకు గ్రంథాలయాలను ఎలాంటి సమాచార వనరులను వినియోగిస్తున్నారు ఈ సిద్ధాంత గ్రంథంలో వివరించారు.తన పరిశోధనకు సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథపాలకులకు, తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.