స్థానిక సాక్షి జర్నలిస్టుపై దాడి చేయడానికి ఖండించిన టియుడబ్ల్యూజే ఐజేయు మెదక్ ఉమ్మడి జిల్లా హెల్త్ కమిటీ నెంబర్ మెంగర్తి సుధాకర్
మెదక్ సెప్టెంబర్ .20 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి స్థానిక సాక్షి జర్నలిస్ట్‌పై దాడి చేయడాన్ని టీయూడబ్ల్యుజే -ఐజెయూ మెదక్ ఉమ్మడి జిల్లా హెల్త్ కమిటీ మెంబర్ మెంగర్తి. సుధాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారదులుగా పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్ట్‌లపై ప్రజా ప్రతినిధులు దాడులు చేయడం అమానుషమన్నారు. తరచూ ఏదో ఒక చోట జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా నాయకులు చేస్తున్నటువంటి అక్రమ దందాలు అక్రమాల నిజనించాలని వెలికి తీసినటువంటి జర్నలిస్టులపై దాడులు చేసి పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇకపై జర్నలిస్టులపై దాడులు చేసినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు చేపట్టాలని
టియుడబ్ల్యూజే ఐజేయు
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులం ఏకమై ర్యాలీలు ధర్నాలు చేస్తామని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షిస్తున్న ప్రజా నాయకులకు తగిన గుణపాఠం చెప్పకాముందే వారి యొక్క పరివర్తలను మార్చుకోవాలని లేనియెడల మేము కూడా ఉద్యమాలు చేపట్టి ప్రస్తారోకాలు చేస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఉంచుకోండి కానీ ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా జర్నలిస్ట్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.