ఓ.బీ.సీ. నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ .ఖదీర్
నల్లగొండ సెప్టెంబర్ 20 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);మహిళా బిల్లులో ఓబీసీమహిళా కోట ప్రస్తావించకపోవడం అన్యాయమని, కులగణన చేసి ఓ.బీ.సీ.లకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే మహిళా బిల్లుకు ఆమోదం తెలుపాలని ఓ.బీ.సీ. నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ .ఖదీర్ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసారు.75 కోట్ల జనాభా కలిగి ఉన్న బీ.సీ.లకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఓ.బీ.సీ మహిళలకు లకు మహిళా బిల్లులో 50 శతం రిజర్వేషన్స్ కల్పిబంచక పొతే దొరలు పోయి దొరసానులు వస్తారన్నారు.దీనితో బిసి మహిళలకు ఒరిగేది ఏమిలేదన్నారు. పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,సబ్ కోట కల్పించాలని అన్నారు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు