మెదక్ తూప్రాన్ 24 జులై ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పద్మశాలి సంఘం భవన నిర్మాణం, మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం నిధుల కోసం మంత్రి హరీష్ రావు గారికి
వినతి పత్రం ఇచ్చారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు ఈ నెలలో నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చారు. దీని భాద్యతను తెలంగాణ రాష్ట్ర
ఎఫ్. డి.సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కి అప్పగించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు కు పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పద్మశాలి యూత్ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్
నందాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు నందాల దుర్గా ప్రసాద్, యూత‌్ అధ్యక్షులు బొడ్డు రాఘవేందర్ , ప్రదాన కార్యధర్శి కొండ రాజు,
ఎస్. వెంకటనారాయణ , నాయకులు చిత్ర ఆర్ట్స్ బిక్షపతి, నందాల క్రిష్ణ, నాగరాజు , శ్రీదర్, స్వర్గం గణేష, మధు, సహదేవ్ లు ప్రాజ ప్రతినిధులు పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గోన్నారు .