అమ్మపాలెంలోలో అంగరంగ వైభవంగా మొహర్రం వేడుకలు

 

-అధ్యక్షులు గాలిబ్ పాషా అధ్వర్యంలో ఏర్పాట్లు

 

ఖమ్మం ప్రతినిధి జులై 24 (ప్రజాబలం) ఖమ్మం మొహర్రంనెలను షహీద్ (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ పండుగలా కాకుండా వర్థంతిలా జరుపుకుంటారు.ఇస్లాంలో ఈ ముహర్రం నెల ఆషూరా కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం శోక దినాలుగా గడుపుతారు తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు ఖమ్మం జిల్లాలో అత్యంత వేడుకగా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.పీర్ల సావిడి కమిటీ అధ్యక్షులు షేక్ గాలిబ్ పాషా అధ్వర్యంలో మొహర్రం ఉత్సవాలకు భారీగా ఏర్పాటు చేశారు.ఈ సంధర్బంగా గాలిబ్ పాషా మాట్లాడూతూ ఈనెల 26 నుండి శరగత్ లు 29 వరకు పీర్ల ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయని హిందు-ముస్లీం భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారని వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటి ఉపాధ్యాక్షులు రంజాన్ సాహెబ్ కోశాధికారి హూస్సేన్ సభ్యులు గాలిబ్ పాషా లాల్ సైదులు మధార్ లాల్ సైదులు తదితురులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking