హైదరాబాద్ ఆగష్టు 3;గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మ నరేంద్ర పద్మశాలి ఆధ్వర్యంలో చలో కోరుట్ల పద్మశాలి రాజకీయ యుధ్ధభేరి గోడ పత్రిక ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తాత్కాలిక అధ్యక్షుడు రామ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా గౌరవ సలహాదారులు బూర మల్లేశం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దామాషా ప్రకారం యం.యల్.ఏ., యం.పి సీట్లు కేటాయించాలని డిమాండ్, రాజకీయంగా మా వాటా దక్కాల్సిందే నన్నారు. వివిధ సంఘాల నాయకులు కడియాల బలరాం, దాసి లక్ష్మి నారాయణ,అతినగరం సురేష్, గంజి శ్రీనివాస్, సీత వైద్యం,వలకాటి రాజు, పుప్పాల శ్రీనివాస్ మరియు అల్లి గోవింద్,గోలి జనార్ధన్, కల్లెపల్లి రాజు, మంద వెంకట స్వామి, బల్ల గీత, కూరపాటి సుమలత, చింతకింది సుజాత, కుంటాల దశరథ్ తదితరులు పాల్గొన్నారు.