మంత్రి ఈశ్వర్ ను కోరిన హోమ్ గార్డులు
జగిత్యాల ప్రతినిధి, ఆగస్టు 3(ప్రజా బలం) తెలంగాణ రాష్ట్రంలో హోమ్ గార్డులు చాలి చాలని జీతాలతో ఉద్యోగ భద్రత కరువై ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్తయ్య కోరారు. గురువారం ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సత్తయ్య ఆధ్వర్యంలో హోమ్ గార్డ్స్ కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హోం గార్డ్స్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. అలాగే భక్త రామదాసు ప్రాజెక్టు, అసెంబ్లీ లో, బీఆర్ ఎస్ భవన నిర్మాణ సమయాల్లో, పోలీసు శాఖ అధికారులతో నిర్వహించిన సమయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్మినెంట్ విషయాన్ని మాట్లాడారన్నారు. రెగ్యులర్ పోలీసులతో సమానంగా ప్రజా రక్షణ కోసం పాటుపడుతున్న మా శ్రమను గుర్తించి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ భద్రతపై ఒక ప్రకటన వచ్చేలా ప్రభ్యత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని తెలంగాణ హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్తయ్య కోరారు. ఆయన వెంట హోమ్ గార్డులు లక్ష్మీ నారాయణ తోపాటు పలువురు ఉన్నారు.