పొలాసలో నరేంద్ర మోడీకి పాలాభిషేకం

 

జగిత్యాల రూరల్, అక్టోబర్ 2: పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనతో సోమవారం పొలాసలో బిజెపి శ్రేణులు మోడీకి పాలాభిషేకం చేశారు. స్థానిక చౌరస్తాలో పొలాస శక్తి కేంద్ర ఇంచార్జ్ ఓల్లాల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బిజేపి శ్రేణులు మోడీకి జిందాబాద్ లు కొడుతూ మోడీ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మోడీ చిత్రపటానికి పాలభిశేఖం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోని ఎందరో రైతుల ప్రధాన పంట అయిన పసుపు పంటకై ప్రధాని నరేంద్రమోడీ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ తీసుకొన్న నిర్ణయం ఎందరికో ప్రయోజనమన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేస్తోందని రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వాధిస్తారని రాజశేఖర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో 117బూత్ అధ్యక్షులు కుర్మా రాజు,119బూత్ అధ్యక్షులు మెళ్ళ దామోదర్,120బూత్ అధ్యక్షులు సంగ తిరుపతి, కుర్మా రమేశ్, మెల్ల లక్ష్మిరాజం, గోసం గారి నాగరాజు, మిల్కురి రాజన్న, తోట సత్యం, గడ్డి మల్లేష్, మిక్కురి గంగన్న, రెంటం తిరుపతి, ఎడ్ల మల్లేశం, బుర్ర వేణు, ఉప్పు కిషన్, నడిపి గంగన్న, గోపు తిరుపతి, కత్రోజీ భుమేష్, ఉప్పు రోహిత్, రేంటం గంగారెడ్డి, పడాల లక్ష్మణ్, దర్నేని మహేష్, పొడేటి నారాయణ నాయకులు, రైతులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking