రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 02 అక్టోబర్ 2023: ఆదివారం అక్టోబర్ 1న సాయంత్రము తెలంగాణా ప్రభుత్వం ఐ.టీ. మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు మైహోం అవతార్ నార్సింగ్ వద్ద 23 కి. మీ మేర నిర్మించిన అధునాతన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ని ప్రారంభించిన అనంతరం చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి 8 కి. మీ మేర సైక్లింగ్ చేశారు వారితో పాటు భూగర్భ జలాల మరియూ సమాచార శాఖా మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ. ప్రకాశ్ గౌడ్, అన్ని రంగాల నుండీ పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు ఈ శుభ ఘడియలను కన్నులారా కాక్షించి పాల్గొనడం జరిగినది